: పాక్ సరిహద్దులో ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ చమన్ పట్టణంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందినట్లు పాక్ కు చెందిన డాన్ న్యూస్ వెల్లడించింది. అనేకమంది గాయపడ్డారని, కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. కస్టమ్స్ హౌస్ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చుకోవడం వల్లే ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. కాగా ఈ దాడికి తామే కారణమని ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించుకోలేదు.