: ఎంపీల ఒత్తిడి వల్లే ప్రక్రియ ముందుకు సాగట్లేదు: ఎంపీ అనంత
రాజకీయ పార్టీలు చేసిన తప్పిదం వల్లే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి వల్ల విభజన ప్రక్రియ ముందుకు సాగకుండా ఆగిందని తెలిపారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదని ఎంపీ చెప్పారు. హైదరాబాదుతో పాటు, ప్రాజెక్టుల విషయంలో పరిష్కారం చూపేవరకు విభజనకు ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.