: కేసీఆర్ పై మండిపడ్డ రేణుకా చౌదరి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. 'ఆంధ్రావాళ్లు తెలంగాణ ద్రోహులు' అనే హక్కు కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి, బెదిరించి దోచుకోవడమే ఆయన పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం కేసీఆర్ కు ఇష్టం లేదని, రాష్ట్రం వస్తే తన దుకాణం బంద్ అవుతుందనే, ప్రజలను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు మాని తన పని తాను చూసుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు. తెలంగాణపై ఆయనకు ఎవరూ హక్కులివ్వలేదని రేణుక వ్యాఖ్యానించారు.