: బాధితులకు వైద్య సేవలు అందించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు


అత్యాచారం, రోడ్డు ప్రమాదాల బాధితులకు వైద్య సేవలందించడానికి ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరించడం కుదరదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశగా తాము ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వుల గురించి ప్రజలందరికీ తెలియజేసేలా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితులను చేర్చుకోవడానికి తిరస్కరించవద్దని తామిప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బాధితులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స ఇప్పించాలంటూ కోర్టు స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News