: జగన్ హైదరాబాదులో సభ పెట్టడం ఇబ్బందికరం: జగ్గారెడ్డి
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం ఇకపై సాధ్యం కాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత పార్టీలన్నీ యూటర్న్ తీసుకున్నాయని అన్నారు. ఇప్పుడు ఏం చేసినా లాభంలేదని తెలిపారు. జగన్ హైదరాబాదులో సభ పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం కాదని అన్నారు. దీనివల్ల ఇరు ప్రాంతాల మధ్య మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయని.. లేదా, దీనికి పోటీగా మరో సభను పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. దీనికితోడు, వైఎస్సార్సీపీ నేతలు మొదటి నుంచి సమైక్యవాదులు కాదని విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకే జగన్ సమైక్యాంధ్రను ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు.