: నలుగురు భారతీయ ఖైదీలకు పాక్ జైళ్ల నుంచి విముక్తి
పాకిస్థాన్ లోని వివిధ జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్న నలుగురు భారతీయ ఖైదీలకు విముక్తి లభించనుంది. శిక్ష పూర్తయిన నలుగురు ఖైదీలను విడుదల చేయాలని ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూ దిల్ బాగ్ సింగ్, సునీల్ లతో పాటు మరో ఇద్దరు భారతీయులను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పాకిస్థాన్ హోం మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. పాక్ లోకి వీరు అక్రమంగా ప్రవేశించారని గతంలో వీరిని అరెస్టు చేశారు. వీరి శిక్షాకాలం పూర్తయినందున, విదేశీ ఖైదీల విడుదల కోసం చట్ట సంబంధమైన ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు పాక్ హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.