: ఢిల్లీ సదస్సులో మోడీ నామస్మరణ
ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ప్రారంభమైన 'సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్' సదస్సులో నరేంద్ర మోడీకి నీరాజనాలు పట్టారు. సదస్సుకు వేదికైన త్యాగరాజు ఇండోర్ స్టేడియం మోడీ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మోడీతో వేదిక పంచుకున్నారు. అనంతరం, సదస్సులో పాల్గొన్న విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోడీ జవాబిచ్చారు. విద్యార్థుల నడుమ కూర్చుని సదస్సును వీక్షించాలని ఉందని మోడీ ఈ సందర్భంగా చెప్పారు.