: జగన్ ఎప్పటికైనా జైలు పక్షే: మందకృష్ణ
రాహుల్ ను ప్రధాని చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే జగన్ ను బయటకు తీసుకొచ్చారని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సీమాంధ్రలో ప్రతిపక్ష పార్టీకి ఓట్లు పడకుండా చేయడం, వైఎస్సార్సీపీతో సమైక్యవాదాన్ని నడిపించడం కూడా ఈ ఒప్పందంలో భాగంగానే అని వివరించారు. సోనియా మాట వినకపోతే మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందనే భయంలో జగన్ ను ఉంచారని తెలిపారు. జగన్ ఎప్పటికైనా పంజరంలోని చిలుకేనని అన్నారు. జగన్ పాల్పడిన అవినీతికి జీవితకాలం శిక్ష కూడా సరిపోదని తెలిపారు. ఈ నెల 5న గుంటూరులో సభను నిర్వహించనున్నట్టు మంద కృష్ణ వెల్లడించారు.