: 300 ఆవులకు ప్రాణదానం
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి హైదరాబాద్ నగరంలోని కబేళాలకు తరలిస్తున్న 300 ఆవులను ఈ తెల్లవారుజామున గో సంరక్షణ సమితి సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆరు లారీల్లో 300 ఆవులను నగరానికి తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా నగర శివారులోని మేడ్చల్ చెక్ పోస్టు వద్ద శ్రీరాం సంరక్షణ, హిందూవాణి, భజరంగ్ దళ్ సమితి సభ్యులు లారీలను పట్టుకుని మేడ్చల్ పోలీసు స్టేషన్ లో అప్పగించారు. లారీల్లో ఆవులను కుక్కి తెస్తుండడంతో 15 ఆవులు మృత్యువాత పడ్డాయి.