: మా హక్కులు కాలరాయాలని వైఎస్సార్సీపీ చూస్తోంది: కోదండరాం
హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ పెట్టనున్న వైఎస్సార్సీపీపై తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. సమైక్యవాదం పేరిట వైఎస్సార్సీపీ సభలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కులు హరించాలని చూస్తోందని ఆరోపించారు. అలా చేయాలని ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకే సమైక్యవాదం అంటున్నారని విమర్శించారు. సమైక్యవాదులు ఇప్పటికైనా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు విరమించాలని కోదండరాం కోరారు.