: వివాదాస్పద ఆర్డినెన్స్ ఉపసంహరణ?


నేరచరితులైన రాజకీయ నేతలకు మేలు చేసేలా ఉందన్న ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ ఉపసంహరించుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు, సోనియాగాంధీ, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ లతో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఆర్డినెన్స్ పై ప్రధాని.. రాష్ట్రపతిని కలవనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా.. నేరచరితులకు చట్టసభల్లో స్థానంపై తీసుకురావాలనుకున్న ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ కు యూపీఏ భాగస్వామ్య పక్షాలు, విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News