: పునరాలోచనలో సీమాంధ్ర బీజేపీ నేతలు
విభజనతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమం, నిరసనల నేపథ్యంలో సీమాంధ్ర బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. విభజనకు పార్టీ మద్దతిస్తున్నా, రేపు రాష్ట్రం విడిపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీని కొంతమంది సీమాంధ్ర నేతలు ఢిల్లీలో కలిశారు. విభజన వల్ల సీమాంధ్రలో తలెత్తే సమస్యలను అద్వానీ దృష్టికి తెచ్చారు. సీమాంధ్ర సమస్యలపై కేంద్రం స్పష్టత ఇచ్చేంతవరకు మద్దతు తెలపొద్దని విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలు అద్వానీని కలిసిన సమయంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కూడా అక్కడే ఉన్నారు.