: ప్రధానితో ముగిసిన రాహుల్ భేటీ
ప్రధానమంత్రి మన్మోహన్ తో కాంగ్రెస్ నెంబర్ టూ రాహుల్ గాంధీ సమావేశం ముగిసింది. వీరిరువురూ దాదాపు 25 నిమిషాల సేపు భేటీ అయ్యారు. వీరి మధ్య కళంకిత నేతలకు సంబంధించిన ఆర్డినెన్స్ గురించే ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్డినెన్స్ కు సంబంధించి తన వ్యాఖ్యలపై రాహుల్ ప్రధానికి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా వివాదాస్పద ఆర్డినెన్స్ పై కేబినేట్ లో మరోసారి చర్చలు జరుపుదామని రాహుల్ కు ప్రధాని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.