: నేడు ఢిల్లీలో బొత్స బిజీ బిజీ
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అవుతారు. తరువాత సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశమవుతారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్' నినాదంతో ఆయన ఈ ఢిల్లీ పర్యటన చేస్తున్నారు.