: రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే : చంద్రబాబు
'సిటిజన్స్ ఆఫ్ అకౌంటబుల్ గవర్నెన్స్' సదస్సులో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ కు చురకలంటించారు. రాహుల్ ప్రధాని పదవికోసం పాకులాడకుండా హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఆర్డినెన్స్ పై రాహుల్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని బాబు అన్నారు. తన వ్యవహార శైలితో ప్రధానిని కించపరిచేలా చేసిన రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.