: తెలంగాణ ఏర్పాటుకే ప్రాధాన్యం: ప్రధాని మన్మోహన్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన ప్రాధాన్యతలలో అగ్రభాగాన ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖానించారు. అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వస్తూ తన ప్రత్యేక విమానంలో ప్రధాని మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. ఢిల్లీకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను అడుగుతానని ప్రధాని తెలిపారు. 'ఈ అంశం తరచూ ప్రభుత్వం దృష్టికి వస్తూనే ఉంది. నా ఆలోచనల్లో ఇప్పుడు ఇదే ప్రాధాన్య అంశంగా ఉంది' అన్నారు.