: ప్రజల్లో భయాలున్నాయి.. తొలగించండి: జేడీ శీలం
రాష్ట్ర విభజన వల్ల తలెత్తే ఇబ్బందులను పరిష్కరించలేరన్న భయం సీమాంధ్ర ప్రజల్లో ఉందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ తో సమావేశమైన ఆయన.. గత 62 రోజులుగా సీమాంధ్రలో ప్రభుత్వ పాలనతోపాటు రవాణా వ్యవస్థ స్తంభించిందని తెలిపారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు.