: నిమ్మగడ్డ బెయిల్ విచారణ ఈనెల 14కు వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది. సీబీఐ విచారణకు సహకరిస్తున్నానంటూ నిమ్మగడ్డ సుప్రీంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం తెలిపింది.