: అమెరికా సంక్షోభంతో పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు
అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆయిల్ మార్కెట్ పై పడింది. దీంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లకు పడిపోయింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించిన సంగతి తెలిసిందే. గత 17 ఏళ్లలో ఈ రకమైన సంక్షోభం నెలకొనడం ఇదే తొలిసారి.