: హైదరాబాదుపై మాకూ ఉంది హక్కు: నన్నపనేని
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు హైదరాబాదు తమదే అని పునరుద్ఘాటించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి స్పందించారు. హైదరాబాదుపై కేసీఆర్ కు ఎంత హక్కుందో తమకూ అంతే హక్కుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని నన్నపనేని ఆరోపించారు. ఇంతకుముందు సోనియాను నానా మాటలు అని, ఇప్పుడు ఆమెను సీమాంధ్రులు దుర్భాషలాడుతున్నారని వాపోవడం కేసీఆర్ కు తగదని అన్నారు. దీన్నిబట్టే ఆయన నిజాయతీ ఏంటో ప్రజలకు అర్థమైందని విమర్శించారు.