: గూగుల్ ప్లే స్టోరులో బుక్స్
గూగుల్ ప్లేలో ఇప్పటి వరకూ అప్లికేషన్లు, గేమ్స్ ను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది. కానీ, ఇప్పటి నుంచీ పుస్తకాలు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త రుసుం చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లో మన దేశానికి సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు.
స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పీసీ, ల్యాప్ టాప్, సిస్టం ఏదైనా సరే నెట్ కనెక్షన్ ఉంటే చాలు... అలా ఓపెన్ చేసి పుస్తకాలతో కాలక్షేపం చేసేయొచ్చు. కొంచెం చార్జి భరించగలిగితే మీ పఠనా దాహం తీర్చుకోవచ్చు.