: ఆరాధ్యకు రూ.54 కోట్ల కానుక
స్టార్ల ఇంట లిటిల్ స్టార్ గా జన్మించిన ఆరాధ్య చిన్ననాటి నుంచే వైభవాన్ని అందుకుంటోంది. పూర్వకాలంలో రాజులు కూడా తమ కూతుర్లకు అంతేసి బహుమతులు ఇచ్చి ఉన్నారో, లేదో... కానీ ఈ రాకుమారిపై అభిషేక్, ఐశ్వర్యలు కానుకల వర్షం కురిపిస్తున్నారు.
తన ముద్దుల కూతురు ఆరాధ్య మొదటి పుట్టిన రోజు 2012, నవంబర్ 16న ఐశ్వర్య, అభిషేక్ ఏకంగా బీఎండబ్ల్యూ కారు కానుకగా ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఒక చిన్న బహుమతి సమర్పించుకున్నారు. దుబాయ్ లో ఒక ఇంద్రభవనాన్ని 54 కోట్ల రూపాయలతో ఆరాధ్య కోసం కొనుగోలు చేశారట.
నటనతో కోట్లు కురిపించుకుంటున్న ఈ స్టార్ జంటకు 54 కోట్లు ఓ లెక్కా? ఆరాధ్య తాత కూడా సూపర్ స్టారే. ఇంకేం, అన్నీ కలిసి ఆరాధ్య పంట పండుతోంది. బహుమతుల మీద బహుమతులు వచ్చి పడుతున్నాయి.
నటనతో కోట్లు కురిపించుకుంటున్న ఈ స్టార్ జంటకు 54 కోట్లు ఓ లెక్కా? ఆరాధ్య తాత కూడా సూపర్ స్టారే. ఇంకేం, అన్నీ కలిసి ఆరాధ్య పంట పండుతోంది. బహుమతుల మీద బహుమతులు వచ్చి పడుతున్నాయి.