: చదివేది డిగ్రీ.. చేసేది దోపిడీ..


అతడి పేరు మహ్మద్ ఫర్హాన్. హైదరాబాదు మంగళహాట్ కు చెందిన ఈ యువకుడు హిమాయత్ నగర్లో డిగ్రీ చదువుతున్నాడు. విలాసాలకు అలవాటు పడిన ఫర్హాన్ డబ్బు కోసం చోరీలకు తెగించాడు. 2010 నుంచి స్నాచింగ్ మొదలెట్టిన ఈ యువకుడు అదే ఏడాది పోలీసులకు పట్టుబడి జైలుకెళ్ళాడు. విడుదలైనా అతనిలో మార్పు రాలేదు. మళ్ళీ హస్తలాఘవాన్నే నమ్ముకున్నాడు. 18 చోరీలు చేసి గత ఏప్రిల్లో మరోసారి జైలుకెళ్ళాడు.

ఇటీవలే విడుదలైనా పాతపంథాను వీడలేదు. మహంకాళి మార్కెట్, కార్ఖానా పీఎస్ పరిధిలో 8 చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ విసిరాడు. సోమవారం అనుమానాస్పదంగా కనిపించడంతో మారేడుపల్లి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 'తమదైన శైలి'లో విచారించారు. ఫర్హాన్ వద్ద రూ.7.5 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News