: ఇండియా టూర్ కి దూరమైన ఆసీస్ కెప్టెన్ క్లార్క్


ఇండియా టూర్ కి ముందే ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆస్ట్రేలియా సారథి మైఖేల్ క్లార్క్ ఇండియాలో జరగనున్న ఏకైక టి20, వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఈ వివరాలను క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్షన్ ప్యానెల్ ఈ రోజు తెలిపింది. క్లార్క్ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో జార్జ్ బెయిలీ ఆస్ట్రేలియా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. క్లార్క్ స్థానంలో సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన కల్లమ్ ఫెర్గ్యూసన్ జట్టులోకి వచ్చాడు.

అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమయ్యే ఇండియా టూర్ లో కంగారూలు ఒక టీ20 తో పాటు 7 వన్డే మ్యాచ్ లు ఆడనున్నారు. ఎంతో కీలకమైన ఈ సిరీస్ కు క్లార్క్ దూరమవడం దురదృష్టకరమని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే క్లార్క్ త్వరలోనే కోలుకుని నవంబరులో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్ కి అందుబాటులోకి రాగలడనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News