: కుక్కతో కరిపించి.. పోలీసులే భయపడేలా హింసలు పెట్టిన మహిళ అరెస్టు


బడికెళ్లే పదిహేనేళ్ల పిల్ల చేత నిర్బంధంగా చాకిరీ చేయించుకోవడమే కాకుండా ఆ బాలికపై దాడి చేసి, నానాహింస పెట్టి, పెంపుడు కుక్కలచేత కరిపించి, మాటల్లో చెప్పలేని దారుణాలకు పాల్పడ్డ ఓ మహిళను ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. ఫ్లాట్ నుంచి అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో రాత్రి ఆ ఇంటికి వెళ్లిన పోలీసులకు దయనీయమైన స్థితిలో ఒక బాలిక కన్పించింది. ఆమె ఒంటినిండా అంగుళం ఖాళీ లేకుండా ఉన్న గాయాలు చూసి పోలీసులే జడుసుకున్నారు.

వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా బాలిక తల ఎముక కూడా విరిగిందని వైద్యులు నిర్థారించారు. ఏడాది క్రితం తన పినతల్లి ఇక్కడికి తీసుకొచ్చి అప్పగించిందని అప్పటి నుంచి ఈ నరకం అనుభవిస్తున్నానని బాలిక తెలిపింది. నోయిడాలో ఉద్యోగం చేస్తున్న ఆ ఇంటి యజమానురాలు వందనను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ రాష్ట్ర శిశుసంక్షేమ శాఖా మంత్రి కిరణ్ వాలియా బాలిక బాధ్యత చేపట్టారు. ప్రభుత్వ ఖర్చుతో ఆమెకు వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News