: పాక్ తీరు మారదా?
దాయాది దేశం పాకిస్థాన్ తీరు మారదా? అంటే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాకిస్థాన్ వైఖరి మారదనే అనిపిస్తోంది. భారత్-పాక్ దేశాల ప్రధానుల మధ్య అమెరికాలో చర్చలు జరిగి మూడు రోజులు గడిచాయో లేదో.. పాక్ సైన్యం తన దూకుడు ప్రదర్శించింది. తాజాగా, జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా తంగ్దారా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. ఓ వైపు, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ తో శాంతి కోరుకుంటున్నామని చెబుతుండగా.. మరోవైపు, సైన్యం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం గమనార్హం.