: సోనియా, రాహుల్ తనకు ఆదర్శం అంటున్న లాలూ భార్య
దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలవడంతో పార్టీ కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయన అర్ధాంగి రబ్రీదేవి నడుంబిగించారు. సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ ను ఎలా నడిపిస్తున్నారో... అలాగే తాను, తన కుమారులు తేజ్, తేజస్వి కలసి ఆర్జేడీని నడిపిస్తామని రబ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. రబ్రీదేవికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. లాలూ చిన్న కుమారుడు తేజస్వి ని లాలూ వారసుడిగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తేజస్వి నిన్న లాలూతో పాటు కోర్టుకు వచ్చారు. ఆయన తన తండ్రి దోషిగా నిరూపితమవడాన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు.