: రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ సమైక్య పోరు
సమైక్యాంధ్ర ఉద్యమానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయింది. రేపటి (బుధవారం) నుంచి సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో ఒకేసారి నిరాహార దీక్షలు చేపట్టనుంది. గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే సమయంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు, బైక్ ర్యాలీలు, మానవహారాలు లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ వెల్లడించింది.