: సీమాంధ్రకు మద్దతుగా పోర్టు అధికారుల సమ్మె షురూ


సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలోని అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఇప్పుడు ఈ సెగ ఎంతో కీలకమైన పోర్టులను తాకింది. ఈ రోజు నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మె చేపడుతున్నట్టు చిన్న తరహా పోర్టులలో పనిచేస్తున్న అధికారులు తెలిపారు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేవుల గజిటెడ్ అధికారుల అసోసియేషన్ కార్యదర్శి రాధాకృష్ణమూర్తి తెలిపారు. మన రాష్ట్రంలో కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, భీమునిపట్నం, భావనపాడు, కళింగపట్నంతో పాటు 13 చిన్న తరహా పోర్టులున్నాయి.

  • Loading...

More Telugu News