: కేంద్రమంత్రి పనబాక లక్ష్మికి సమైక్యాంధ్ర సెగ
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి సీమాంధ్ర సెగ తగిలింది. కృష్ణా జిల్లా గుడివాడలో సమైక్యవాదులు ఆమెను అడ్డుకున్నారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమెకు ఏపీఎన్జీవోలు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు.