: ఇలా మేనికి మెరుపులద్దండి!


మీ ముఖారవిందానికి చక్కటి మెరుపులద్దాలనుకుంటున్నారా... అయితే చిన్న చిన్న కిటుకులు పాటిస్తే చాలు. అందులో ఒకటి అనాదిగా వస్తున్న సాంప్రదాయం, ముఖానికి చక్కగా పసుపు రాయడం. ఒకప్పుడు ముఖానికి చక్కగా పచ్చటి పసుపు రాసుకునేవారు. దీనికి అప్పట్లో పెద్దలు చెప్పుకున్న కారణాలేవైనా పసుపు శరీరానికి మెరుపునిస్తుంది. అంతేకాదు చర్మంపైన ఉండే మృతకణాలను తొలగించడంలో పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పసుపుతోపాటు ఇప్పుడు కొన్ని ఇతర పదార్ధాలను కలిపి వాడడం వల్ల మరింత మెరుపును మనం సంతరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మనం ఇళ్లలో పసుపును యాంటీ బయోటిక్‌గా వాడుతుంటాం. ఏదైనా చిన్నపాటి గాయం తగిలితే వెంటనే పసుపును గాయంపైన వేస్తాం. దీనివల్ల ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే పసుపులో కొద్దిగా చందనాన్ని, కొద్దిగా పాలమీగడను కలిపి ముఖానికి రాసుకుని అరగంటపాటు ఉంచి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం ఛాయ పెరుగుతుందట. ఇంకా పసుపును, ఉసిరికాయ చూర్ణాన్ని సమభాగాలుగా తీసుకుని రెండు గ్రాముల చొప్పున రోజూ ఉదయం, సాయంత్రం తింటూవస్తే క్రమేపీ మధుమేహం అదుపులోకి వస్తుందట. ఇంకా పసుపు, వేపచెక్క, పట్టచూర్ణం, కరక్కాయ చూర్ణం వీటిని సమభాగాలుగా తీసుకుని రెండు గ్రాముల చొప్పున తీసుకుంటే చర్మవ్యాధులు, క్రిమి రోగాలు కూడా నయమవుతాయట. పసుపు, వేపాకు చిగుర్లు, దిరిసెన పట్టచూర్ణం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలకు పట్టుగా వేస్తే తగ్గిపోతాయట.

  • Loading...

More Telugu News