: ముందు తరాల అనుభవాలను తెలుసుకోవచ్చట!
తల్లిదండ్రులు ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం పిల్లలకు జన్యుపరంగా సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఒక సరికొత్త అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు జన్యువులను ప్రత్యేకంగా పరీక్షించడం ద్వారా ముందు తరాల వారు ఎదుర్కొన్న అనుభవాలను చక్కగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు తల్లిదండ్రుల్లో జన్యుపరమైన మార్పులు తర్వాత తరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్టు ప్రత్యేక అధ్యయనం ద్వారా వెల్లడించారు. ఈ పరిణామాలను అంచనా వేయడానికిగాను శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. దీన్ని యపీజెనెటిక్స్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో ఒక ప్రత్యేక రసాయనాన్ని తాము ఎంపిక చేసుకున్న డీఎన్‌ఏకు అనుసంధానిస్తామని, సదరు జన్యువును పరిగణనలోకి తీసుకోవడం లేదా తిరస్కరించడం అనే అంశాన్ని పరిశీలిస్తామని, వచ్చిన ఫలితాన్నిబట్టి ముందు తరాల వారు ఎదుర్కొన్న అనుభవాలను సులభంగా విశ్లేషించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.