: జగన్ కు కోర్టు సమన్లు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సమర్పించిన పెన్నా సిమెంట్స్ ఛార్జిషీటును సీబీఐ కోర్టు ఈరోజు విచారణకు స్వీకరించింది. పరిశీలించిన కోర్టు నవంబరు 11న హాజరుకావాలంటూ జగన్, పెన్నా ప్రతాప్ రెడ్డిలకు సమన్లు జారీ చేసింది. అటు విజయసాయిరెడ్డిని కూడా హాజరుపర్చాలంటూ పీటీ వారెంట్ జారీ చేసింది.