: ఇద్దరు పోప్ లకు సెయింట్ హోదా
క్రైస్తవులు అతి పవిత్రంగా భావించే సెయింట్ హోదాను ఇద్దరు పోప్ లకు వర్తింపచేయనున్నట్టు వాటికన్ ప్రకటించింది. పోప్ జాన్ పాల్ 2, పోప్ జాన్ 23లను మహిమాన్వితులు (సెయింట్లు)గా ప్రకటించే ఘట్టం 2014 ఏప్రిల్ 27 న జరుగనుంది. ఈ మేరకు పోప్ ఫ్రాన్సిస్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రకటన అనంతరం వీరిద్దిరినీ సెయింట్లుగా పరిగణిస్తారు. కాగా, కార్డినల్స్ తో అపోస్తలుల మందిరంలో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్ 20వ శతాబ్దంలో మహిమాన్వితులు అయ్యే శక్తి వీరికి ఉన్నట్టు ప్రకటించారు. సెయింట్ గా ప్రకటించాలంటే క్రైస్తవ నిబంధనలకు లోబడి ఆయా వ్యక్తుల కారణంగా అద్భుతాలు జరగాల్సి ఉంటుంది. అవి వాస్తవాలని సదరు కమిటీ నిర్ధారించిన పిదపే సెయింట్ హోదా అందిస్తుంది.