: ఉద్యమం ప్రజాప్రతినిధుల చేతుల్లో లేనట్టుంది: వీహెచ్
సీమాంధ్ర ఉద్యమం ప్రజాప్రతినిధుల చేతుల్లో లేనట్టుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అందరూ ఒప్పుకున్న తరువాతే విభజన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రోడ్ మ్యాప్ ప్రకటించిన తరువాత కొందరు యూటర్న్ తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చేతిలో సీమాంధ్ర నేతలు కీలుబొమ్మలు అయ్యారా? అని వీహెచ్ ప్రశ్నించారు. సోనియా తెలుగు వాళ్ల మధ్య చిచ్చుపెట్టిందని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.