: పట్టు విడిచేదిలేదంటున్న ఏపీఎన్జీవోలు


రాష్ట్ర విభజనకు రెండు నెలలు గడువు పెట్టుకున్న కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందని ఏపీఎన్జీవోలు అన్నారు. భవిష్యత్తులో ఇదే పట్టు కొనసాగిస్తామని ఏపీఎన్జీవోలు తెలిపారు. హైదరాబాదు పంజాగుట్టలోని ఏపీఎన్జీవో భవన్ లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News