: ఇతర నేతలతో నాకు సంబంధం లేదు: సబ్బం హరి


తాను వైఎస్సార్సీపీకి దూరమవుతున్నట్టు ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పందించారు. వైఎస్సార్సీపీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలు మీడియా ద్వారానే తెలిశాయని, పార్టీనుంచి తనకెలాంటి సమాచారం లేదన్నారు. వైఎస్సార్సీపీలో ఇప్పటివరకు తాను జగన్ తోనే మాట్లాడానని, ఇతర నాయకులతో తనకు సంబంధంలేదన్నారు. దీనిపై త్వరలోనే జగన్ తో మాట్లాడతానన్నారు. అయితే, వైఎస్సార్సీపీపై గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. విభజన నిర్ణయానికి ముందు జగన్ ను సీఎం చేయాలన్నది మెజారిటీ ప్రజాప్రతినిధుల అభిప్రాయమన్న సబ్బం, ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అన్నారు.

మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోనని జగన్ చాలాసార్లు చెప్పారని సబ్బం పేర్కొన్నారు. 2014 ఎన్నికల తర్వాత యూపీఏకు ఎస్పీ, డీఎంకే మాదిరిగా బయటి నుంచి మద్దతిస్తామని జగన్, విజయమ్మ చెప్పారని.. ఆ మాటలనే తాను చెప్పానని సబ్బం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News