: జయ ఆస్తుల కేసులో కర్ణాటక సర్కారుకు సుప్రీం అక్షింతలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ ని తప్పించడానికి గల కారణాలు ఏంటని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాకుండా, ప్రత్యేక న్యాయమూర్తి పదవీకాలం పొడిగించే విషయమై సమీక్ష జరపాలని కర్ణాటక హైకోర్టుతోపాటు ప్రభుత్వాన్ని ఆదేశించింది.