: కేసీఆర్.. ఉద్యమం గురించి నీకేం తెలుసు?: సోమిరెడ్డి


టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఉద్యమం గురించి కేసీఆర్ కి ఏం తెలుసంటూ ధ్వజమెత్తారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అవాకులు చవాకులు పేలే ఆయనకు.. మందు పోయించి సభలకు మనుషులను రప్పించుకునే ఆయన అనుచరగణానికి.. ఉద్యమం గురించిన ఓనమాలైనా తెలుసా? అని నిలదీశారు. సినిమా విడుదలైతే ఉద్యమం పేరు చెప్పి డబ్బులు దండుకునే కేసీఆర్ కుటుంబ సభ్యులకు, ఆయన చెంచాలకు ఉద్యమం అనే పదం ఉచ్చరించే అర్హత కూడా లేదని అన్నారు.

సీమాంధ్ర మండల కేంద్రాల్లో లక్షలాది మంది పోగవుతుంటే చూడలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతారా?.. మీరా ఉద్యమానికి నాయకత్వం వహించేది? అని నిలదీశారు. 'ఎవరన్నా ఉద్యమం చేస్తుంటే మరో ఉద్యమ నేత మాట్లాడడు.. అలాంటిది, సమైక్యాంధ్రలో జరుగుతున్నది ఉద్యమం కాదంటావా? కళ్లు పోయాయా? లేక, ప్రజల్ని రెచ్చగొడుతున్నావా?' అని సోమిరెడ్డి ప్రశ్నించారు. తమకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతుంటే కేసీఆర్ తో పాటు కేంద్రానికీ దిమ్మతిరిగిపోతోందని ఆయన అన్నారు. కేసీఆర్, జగన్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలకు ప్రజలను ఎందుకు బలిచేస్తారని ఆయన గట్టిగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News