: ఒక్క రబ్బర్ బుల్లెట్ వాడకుండా శాంతిభద్రతలు అదుపు చేశా: డీజీపీ దినేశ్ రెడ్డి


పదవీకాలంలో ఒక్క రబ్బర్ బులెట్ కూడా వాడకుండా శాంతిభద్రతలను అదుపు చేయడం గర్వంగా ఉందని దినేశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్ పేట పోలీస్ మైదానంలో వీడ్కోలు వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతల పరంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను డీజీపీగా బాధ్యతలు స్వీకరించానని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించే క్రమంలో ఏమాత్రం పరిస్థితులకు తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News