: ప్రారంభమైన సీబీఎస్ఈ పరీక్షలు
సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు వీటికి హాజరవుతున్నారు. పదో తరగతి పరీక్షలలో 12,59,202 మంది, పన్నెండో తరగతి పరీక్షలలో 9,42,035 మంది పాల్గొంటున్నారు. ఈ నెల 15 వరకు పది, 8 వరకు పన్నెండో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. కంటిచూపు సరిగా లేనివారికి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సహాయంతో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించారు.