: బాబ్లీ నిర్మాణానికి బాబు నిర్లక్ష్యమే కారణం: కేటీఆర్
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు వేసిందని తెరాస ఎమ్మెల్యే కె. తారకరామారావు ఆరోపించారు. సుప్రీం తీర్పు రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వెంటనే అఖిల్ పక్షం ఏర్పాటు చేసి ప్రధాన మంత్రితో చర్చించాలన్నారు. లేకపోతే భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని కేటీఆర్ చెప్పారు.