: విభజనను సోనియా ఆలస్యం చేస్తున్నారు : సీపీఐ నారాయణ


రాష్ట్ర విభజన ప్రక్రియను సోనియాగాంధీ ఆలస్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. దీనివల్ల రాష్ట్రం శ్మశానంగా మారుతోందని అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన సీపీఐ పార్టీ సమావేశంలో నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్... అదేదో ఢిల్లీలో చేస్తే బాగుంటుందని సూచించారు. అంతేకాకుండా, సమైక్యాంధ్ర ముసుగులో మతోన్మాదులు, దోపిడీదారులు, అవినీతిపరులు ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News