: రాష్ట్రంలో వెనుకబడింది రాయలసీమే : సూర్యప్రకాష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే రాయలసీమ ప్రాంతమే ఎక్కువ వెనుకబడిందని సమైక్యాంధ్ర ఐకాస నేత సూర్యప్రకాశ్ తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికలో రాయలసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిందని చెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనను సీమాంధ్రులు తిప్పికొట్టాలని అన్నారు.