: రాష్ట్రానికి కొత్తగా మరో రైలు


మన రాష్ట్రానికి కొత్తగా మరో రైలు రానుంది. సికింద్రాబాద్ నుంచి హుబ్లీకి కొత్త రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ప్రకటించారు. దీంతో పాటు నాందేడ్ నుంచి నంగాల్ దామ్ ల మధ్య మరో రైలును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. కొత్త రైలు అక్టోబరు 3వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది. ఈ ట్రైవీక్లీ ఎక్స్ ప్రెస్, వారానికి మూడు రోజులు (సోమ, గురు, శని) సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 7.50 గంటలకు హుబ్లీ చేరుకుంటుంది. అలాగే, బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 8.50 గంటలకు హుబ్లీ నుంచి బయలుదేరి ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ సికింద్రాబాద్ - హుబ్లీ ఎక్స్ ప్రెస్...బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, చిత్తాపూర్, వాడి, గుల్బర్గా, గంగాపూర్ రోడ్, హోత్గి, ఇందీ రోడ్, బీజాపూర్, బసబంగబాగెవాడి, ఆల్మట్టి, బాగల్ కోట్, బాదామి, హోలి ఆలూర్, గదగ్, అన్నెగెరి స్టేషన్లలో మాత్రం ఆగుతుంది.

  • Loading...

More Telugu News