: హైదరాబాద్ లో 'సకల జన భేరి' కి సర్వం సిద్ధం


కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుపుతూ, పార్లమెంటులో తక్షణం తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస తలపెట్టిన 'సకల జన భేరి' సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని నిజాం కళాశాల మైదానంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు జరిగే ఈ సదస్సును తెలంగాణ వాదులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను నిలిపి వేస్తే తాము ఊరుకోబోమని, సమైక్య రాష్ట్రంలో ఇక ఉండబోమని కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

సభ జరిగే ప్రాంగణానికి కాళోజీ ప్రాంగణంగా, వేదికకు ఆచార్య జయశంకర్ వేదికగా నామకరణం చేశారు. రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు. ఒకటో నంబరు ద్వారానికి ఆచార్య కొండా లక్ష్మణ్ పేరు, రెండో ద్వారానికి సదాలక్ష్మి పేరు పెట్టారు. ఈ సదస్సుకు లక్షమందికి పైగా తెలంగాణ వాదులు హాజరవుతారని భావిస్తున్నారు .

  • Loading...

More Telugu News