: రాంగోపాల్ వర్మకు 'కుబేర్' పడవ యజమాని లీగల్ నోటీసు


రాంగోపాల్ వర్మ ఏ సినిమా తీసినా ఆయనను వివాదాలు చుట్టుముడుతూ వుంటాయి. ఈ రోజు విడుదలవుతున్న '26/11 ఇండియాపై దాడి' సినిమా విషయంలో కూడా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే ఓ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వుండగా, తాజాగా ఆయనకు 'కుబేర్' పడవ యజమాని హీరాలాల్ మసానీ లీగల్ నోటీసు పంపించాడు. పాక్ టెర్రరిస్టులు ముంబయ్ రావడానికి ఈ పడవను వాడుకున్న విషయం మనకు తెలిసిందే!

ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన పడవ పేరునూ, రిజిస్ట్రేషన్ నెంబరునూ సినిమాలో వాడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుబేర్ యజమాని మసానీ ఈ నోటీసు ఇచ్చారు. కాగా, ఈ సినిమా పట్ల ఇప్పటికే మంచి పాజిటివ్ రిపోర్ట్ వుంది. ప్రివ్యూ చూసిన వాళ్ళంతా వర్మను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి!                         

  • Loading...

More Telugu News