: ఇలా మీ ఆయుష్షును పెంచుకోండి


మీరు తీసుకునే ఆహారంలో ఒక కప్పు టీని కూడా చేర్చుకుంటే మీరు ఇక దీర్ఘకాలం పాటు జీవించవచ్చట. ఎందుకంటే కప్పు టీలో మన ఆరోగ్యానికి ఉపకరించే పలు సుగుణాలు ఉన్నాయట. మనకు ఎలాంటి రోగాలు రాకుండా కాపాడగలిగే, మన దంతాలకు పటిష్టతనిచ్చే శక్తి ఒక కప్పు టీకుందని తాజా అధ్యయనంలో తేలింది.

బ్రిటిష్‌ డైటెటిక్‌ అసోసియేషన్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌వారు నిర్వహించిన ఒక అధ్యయనంలో టీ సహజమైన హైడ్రేట్‌అని, మన శరీరారోగ్యానికి ఎంతో మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉందని తేలింది. టీ అడ్వైజరీ ప్యానల్‌నుండి డాక్టర్‌ టిం బాండ్‌ మాట్లాడుతూ టీలో ఫ్లేవనాయిడ్స్‌గా పిలవబడే యాంటాక్సిడ్లు ఉంటాయని, ఇవి మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని అందిస్తాయని తెలిపారు. గ్రీన్‌ టీ తీసుకోవడంవల్ల అది మన శరీరంలోని జీవక్రియలను మరింత వేగవంతం చేయడమే కాకుండా శరీరంలో కొవ్వు శోషణను అడ్డుకుంటుందని టిం బాండ్‌ తెలిపారు. టీ సహజసిద్ధమైన ఫ్లోరైడ్‌ను కలిగివుంది కాబట్టి ఇది మన దంతాలకు రక్షణనిస్తుంది, మన ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. అంతేకాకుండా పలు రకాలైన గుండె జబ్బుల ముప్పును కూడా టీ తగ్గిస్తుందని టిం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News