: ఇక బట్టల ఎంపిక చిటికెలో పని!
మీరు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే బట్టల ఎంపిక చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏ డ్రస్ వేసుకుంటే బాగుంటుంది అనే విషయంలో కొందరు అంత తేలిగ్గా ఒక నిర్ణయానికి రాలేరు. ఇలాంటి వారికి సహకరించే కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ ఏ సందర్భంలో ఎలాంటి దుస్తులు, ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందో ఇట్టే మనకు తెలియజేస్తుందట.
మేజిక్ క్లోసెట్ అనే ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ పెళ్లికి, కెరీర్‌కి సంబంధించి, అలాగే ఏదైనా ఫంక్షన్లకు వెళ్లాల్సిన సమయంలోను ఇలా పది రకాల విభిన్నమైన సందర్భాలకు తగు విధంగా దుస్తులను ఎంపిక చేయడంలో మనకు చక్కగా ఉపయోగపడుతుందట. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం, చైనా సైన్స్ అకాడెమీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది కేవలం దుస్తులనే గాకుండా దుస్తులకు తగిన మ్యాచింగ్ ఎంపికలో కూడా ఈ సాఫ్ట్‌వేర్ సహకరిస్తుందట. దీంట్లో ఉండే దాదాపు 24 వేల ఫోటోల ద్వారా ఈ సాఫ్ట్‌వేర్ పనిచేయగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.