: సన్ రైజర్స్ కు పరాభవం


చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో భాగంగా ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాభవం చవిచూసింది. రాంచీలో టైటాన్స్ జట్టుతో మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (37) జట్టులో టాప్ స్కోరర్ కాగా, చివర్లో డేల్ స్టెయిన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) బ్యాట్ ఝుళిపించడంతో సన్ రైజర్స్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగారు. అనంతరం పెద్దగా కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలో దిగిన టైటాన్స్ ను హైదరాబాద్ బౌలర్లు పెద్దగా కష్టపెట్టలేకపోయారు. కెప్టెన్ డేవిడ్స్ (64) అర్థసెంచరీతో మెరవగా, ఓపెనర్ రుడాల్ఫ్ (49 నాటౌట్) జట్టును గెలుపుదిశగా నడిపించాడు. కాగా, ఈ పరాజయంతో సన్ రైజర్స్ నాకౌట్ ఆశలు కాసింత సంక్లిష్టంగా మారాయి.

  • Loading...

More Telugu News